ఎల్‌ఐసీ కొత్త పాలసీ....హెల్త్ ప్లాన్ అందుబాటులోకి

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 02:04 PM

ఎల్‌ఐసీ కొత్త పాలసీ....హెల్త్ ప్లాన్ అందుబాటులోకి

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా తాజాగా కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఎల్‌ఐసీ కొత్తగా ఆరోగ్య రక్షక్ పాలసీ తీసుకువచ్చింది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివీడువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అనారోగ్యం సంభవించినప్పుడు ఈ పాలసీ వల్ల బెనిఫిట్ పొందొచ్చు. పలు రకాల వ్యాధులకు పాలసీ కవరేజ్ వర్తిస్తుంది.

సాధారణంగా కాంప్రహెన్సిల్ హెల్త్ పాలసీలు బీమా చేసిన మొత్తం పరిమితి వరకు వైద్య చికిత్సకు అయ్యే వాస్తవ ఖర్చును తిరిగి చెల్లిస్తాయి. కానీ ఎల్‌ఐసీ ఈ కొత్త పాలసీ వైద్య చికిత్స ఖర్చులతో సంబంధం లేకుండా బీమా చేసిన మొత్తానికి సమానమైన పూర్తి ప్రయోజనాన్ని చెల్లిస్తుంది.

ఈ ఒక్క పాలసీతో ఇంట్లోని వారందరికీ కవరేజ్ వర్తిస్తుంది. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు, పాలసీదారుడికి 80 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పాలసీ తీసుకోవచ్చు. నో క్లెయిమ్ బెనిఫిట్, ఆటో స్టెప్ అప్ ద్వారా హెల్త్ కవర్ పెంచుకోవచ్చు. అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ చెకప్ బెనిఫిట్స్ లభిస్తాయి.





Untitled Document
Advertisements