'సూపర్'కి @16 ఏళ్ళు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 07:03 PM

'సూపర్'కి @16 ఏళ్ళు

నాగార్జున-అనుష్క హీరో హీరోయిన్లుగా కలిసి చేసిన సినిమా 'సూపర్' ఈ నెల 20వ తేదీతో ఈ సినిమా 16 ఏళ్లను పూర్తిచేసుకుంది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 16 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా అనుష్క స్పందించింది. ఈ సినిమాతో తనకి అవకాశం ఇచ్చిన నాగార్జున .. పూరి జగన్నాథ్ కి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అలాగే తనతో కలిసి పనిచేసిన సోనూసూద్ తో పాటు అందరికీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇక ఈ 16 ఏళ్లలో తనని సపోర్ట్ చేస్తూ, ఇంతగా ఆదరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements