వేలానికి ‘వజ్ర’ బస్సులు

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 11:04 AM

వేలానికి ‘వజ్ర’ బస్సులు

ప్రయాణికుల ఆదరణకు నోచుకోని వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లేలా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే, సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో చార్జీలు దాదాపు రెండింతలు ఉండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరవైంది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరవవడంతో 65 మూలనపడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యార్డ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements