రెండో వన్డేలో ఓడిన లంకకు జరిమానా

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:17 PM

రెండో వన్డేలో ఓడిన లంకకు జరిమానా

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన శ్రీలంక టీమ్‌కి మరో షాక్ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7x4, 1x6) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన శ్రీలంక టీమ్‌కి తాజాగా జరిమానా కూడా పడింది.

మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్)తో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన దీపక్ చాహర్.. 8వ వికెట్‌కి అజేయంగా 84 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. ఈ జోడీని విడదీసేందుకు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. చివరి వరకూ బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పుపై సహచరులతో చర్చలు జరుపుతూ కనిపించాడు. దాంతో.. మ్యాచ్ సమయం వేస్ట్ అయినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ తేల్చాడు.

కేటాయించిన సమయంలోపు శ్రీలంక టీమ్‌ వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌‌ని తక్కువగా వేసింది. దాంతో.. నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా పడింది. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లోనే మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి శ్రీలంక పాల్పడితే.. జరిమానా రెట్టింపుకానుంది.





Untitled Document
Advertisements