RRR కాన్సెప్ట్‌ లీక్!!

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:51 PM

RRR కాన్సెప్ట్‌ లీక్!!

SS రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ RRR. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీం పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరి లుక్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ పెంచేశాయి. నిజానికి అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వేర్వేరు ప్రాంతాలకు చెందిన వేర్వేరు నేప‌థ్యాలు ఉన్న వ్యక్తులు. అయినా వాళ్లిద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహకు రూపమిస్తూ రాజ‌మౌళి ఈ సినిమా కథ రాశారట. క‌థంతా స్వాతంత్య్రానికి పూర్వం జరుగుతుంది. అయితే ఈ క‌థ‌లో అల్లూరి, కొమ‌రం భీం ఇద్ద‌రూ చ‌నిపోతారని, మ‌ళ్లీ పున‌ర్జ‌న్మ ఎత్తడం జరుగుతుందని సమాచారం. ఇదే కథను తనదైన కోణంలో ప్రెజెంట్ చేయబోతున్నారట జక్కన్న. ఈ పున‌ర్జ‌న్మ కాన్సెప్ట్ క్లైమాక్స్‌కి ముందే జ‌రుగుతుంద‌ని, ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అయ్యేలా జక్కన్న శ్రద్ద తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.





Untitled Document
Advertisements