SBI ఉచిత ఆఫర్...వారికి బెనిఫిట్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 02:03 PM

SBI ఉచిత ఆఫర్...వారికి బెనిఫిట్

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచిత ఆఫర్ ఒకదాన్ని అందుబాటులో ఉంచింది. దీని ద్వారా చాలా మందికి ఊరట కలుగనుంది. మరీముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఉచితంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR దాఖలు చేసే వెసులుబాటు కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులు ఉచితంగానే ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. ట్యాక్స్2విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.


అంతేకాకుండా రూ.199కే సీఏ సర్వీసులు కూడా పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు చేయాలని భావించే వారు ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ట్యాక్స్2విన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఐటీఆర్ దాఖలు చేయొచ్చు.

ఇకపోతే జూలై 24న ఇన్‌కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఈరోజునే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ట్వీట్ చేసింది.





Untitled Document
Advertisements