మనిషి కూర్చునే విధానం బట్టి మనస్తత్వం!

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 02:09 PM

మనిషి కూర్చునే విధానం బట్టి మనస్తత్వం!

ఓ మనిషి ఎలా కూర్చుంటే ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మనం ఏ చెప్తున్నామో, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇతరులకు స్పష్టమవుతుంది. అందుకే ఎవరితోనైనా మాట్లాడే సమయంలో మన బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా ముఖ్యం. మనం ఎవరు? చుట్టూ ఉన్న పరిసరాలతో మనకు ఎలాంటి బంధం ఉందో మన బాడీ లాంగ్వేజ్ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు సాధారణంగా కూర్చునే విధానం.. మీ పోశ్చర్.. మీ వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తుంది.

​బాడీ లాంగ్వేజ్:

మీరు మాట్లాడే విధానం కంటే మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా మీరేంటో ఎదుటివాళ్లకు తెలియజేస్తుంది. రిలేషన్ షిప్‌లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది మీ భావోద్వేగాలను ఎదుటివారికి కమ్యూనికేట్ చేస్తాయి. మనం ఎవరినైనా కలిసినప్పుడు మన గురించి మనం చేసే పని కంటే ఎక్కువ చేసి మాట్లాడుతుంటాం. కానీ మనం చెప్పే మాటల్లో ఖచ్చితత్వం కనిపించదు. మన ఫీలింగ్స్‌ను మాటల ద్వారా ఎదుటివారికి వ్యక్తం చేయడం కష్టంతో కూడుకున్న పని. అందుకే మనం తరచుగా మన భావోద్వేగాలను బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం.

​1) రెండు పాదాలు ఎదురెదురుగా ఉండటం:

ఈ పొజిషన్‌లో కూర్చునే వారు చాలా క్రియేటివ్‌గా, ఆకర్షణ కలిగి ఉంటారు. వారు యాధృచ్చికంగా మాట్లాడినా వారు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచించరు. అయితే ఈ తత్వం అప్పుడప్పుడు సమస్యలు కలిగించినా వారి సహజ గుణం వారిని సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇలాంటి వారు సాహసాలు చేసినా అవి వారికి మంచి అనుభవాలు మిగులుస్తాయి. ఈ తత్వం గల మనుషులు ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు కొత్త స్నేహితులను సులభంగా సంపాదించుకుంటారు. అయితే ఇలాంటి బంధాలు నిలకడ సాధించలేవు.

​2) కాలి మీద కాలు వేసుకుని పాదాలు నిటారుగా పెట్టడం:

ఈ పొజిషన్‌లో కూర్చునే వారు ఎక్కువగా కలలు కంటుంటారు. వీళ్లెప్పుడూ తమను గొప్పగా ఊహించుకుంటూ పగటి కలలు కంటుంటారు. వీరు సానుభూతితో ఉండటం వల్ల ఇతర వ్యక్తులతో తేలికగా బంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఎవరితో కలవకుండా వెనుకే ఉండిపోతారు. వీరు చెప్పింది వింటారు. వీరు సొంత భావాలు కలిగి ఉండటంతో బలంగా వారి ఫీలింగ్స్‌ను వ్యక్తం చేయగలుగుతారు.

3) రెండు కాళ్లు దూరం దూరంగా పెట్టి పాదాలు పక్కపక్కనే ఉంచడం:

ఈ పొజిషన్‌లో కూర్చునే వారు అస్తవ్యస్తమైన మనసు కలిగి ఏకాగ్రత లేకుండా ఉంటారు. ఇలాంటి వారిలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇతరులు ఏమని భావిస్తారో అని ఆలోచించకుండా మాట్లాడుతుంటారు. వీరిలో ఏకాగ్రత లేకపోవడం కారణంగా ఊరికే విసుక్కుంటూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు వారి తెలివితో త్వరగా ఎదుగుతారు. కానీ బంధాల పట్ల వీరు నిరాసక్తి ప్రదర్శిస్తారు. దీంతో ఎవరో ఒకరు వీరిని ప్రోత్సహించాల్సి ఉంటుంది.

​4) రెండు కాళ్లు నిటారుగా దగ్గరగా పెట్టడం:

ఈ పొజిషన్‌లో కూర్చునే వారు మంచి ఆలోచన స్థాయిని కలిగి ఉంటారు. వీరు సమయ పాలన, పరిశుభ్రత, పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారి ఇళ్లు ఎంతో పరిశుభ్రంగా, చూడముచ్చటగా ఉంటాయి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. ఇలాంటి వారు కొద్దిగా రిజర్వుగా ఉంటారు. తమ గురించి ప్రతి విషయం త్వరగా ఇతరుల వద్ద ప్రస్తావించరు. అయినా చాలా నిజాయితీగా ఉంటారు. పుకార్లను ఎక్కువగా విశ్వసించరు. ప్రతి సందర్భంలో వీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వీరు త్వరగా తమ ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉండదు.

​5) రెండు కాళ్లు కుడివైపుకు వంపుగా పెట్టి పాదాలు దగ్గరగా పెట్టడం:

ఈ పొజిషన్‌లో కూర్చునే వారు తమ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారు. వీరు తమ కెరీర్‌కు ఎంతో విలువ ఇస్తారు. తమ కోసం ఎంతటి లక్ష్యాన్ని అయినా ఏర్పరుచుకుని దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు తమకు వచ్చిన దానితో సంతృప్తి పడరు. వ్యక్తిగత స్థాయిలో ఇంకా ఏదో సాధించాలని తపన పడుతుంటారు. ఉదాహరణకు ఆరోగ్యం విషయంలో పరిపూర్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అటు ప్రేమ విషయంలోనూ తమ సొంత ఆలోచనలతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. ఈ కారణంగా వారు కొన్నిసార్లు ఇప్పటివరకు ఏం సాధించామనేది పట్టించుకోకుండా మరింత సాధించాలని తహతహలాడుతుంటారు.





Untitled Document
Advertisements