"2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురుతుంది": ఈటెల

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 04:09 PM


'ప్రజాదీవెన యాత్ర'లో భాగంగా ఆరోరోజు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో పాదయాత్ర చేశారు. రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని అన్నారు. ఆరుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ధర్మంగానే గెలిచానని ఈటల అన్నారు. తన పక్కన ఎవరూ ఉండకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని, వారు డబ్బు, అధికారాన్ని నమ్మితే తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే.. మరి, మిగతా టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. 2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురుతుందన్నారు.






Untitled Document
Advertisements