తృణబిందుడు ఎవరు? హనుమంతున్నీ ఎందుకు శపించాడు?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 11:52 AM

తృణబిందుడు ఎవరు? హనుమంతున్నీ ఎందుకు శపించాడు?

తృణబిందుడు ఓ ముని. కుషతీర్థంలో తపస్సు చేశాడు. రావణుని తాత పులస్త్యుడు. తృణబిందుని కుమార్తె మాలినికి పులస్త్య బ్రహ్మకు జన్మించిన కుమారుడు. పులస్త్యుడు అడవిలో తపస్సు చేసుకుంటుండగా దేవగాంధర్వ వనితలు అచటికి వెళ్లి తెలియక అతనికి తపోభంగము కల్గించగా ఈ ప్రాంతానికి వచ్చిన కన్యలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. అలా శాపానికి గురైన గంధర్వ కన్య తృణబిందుని కుమార్తె మాలిని. ఆమె తండ్రికి ఈ విషయం చెప్పగా అతడు తన కుమార్తెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి వివాహం చేసుకోమ్మంటాడు. వారికి జన్మించిన మరొక కుమారుడు విశ్రావసువు. హనుమంతుడు ఒకసారి ఒక సింహంతో ఏనుగుతో, పోరాడి వాటిని ఓడించి తృణబిందుడి ఆశ్రమానికి ఇరువైపులా కట్టేస్తాడు. తృణబిందుడు బయటకు వచ్చి వాటిని చూసి భయపడి విషయం గ్రహించి హనుమంతుడి దైవిక శక్తులు నశిస్తాయని శపిస్తాడు. హనుమంతుడు అతన్ని ప్రాధేయపడగా సీతాన్వేషణలో నీకు మరో శక్తి వంతుడు నీ కంటే పెద్ద వాడైన వానరుడు నీ శక్తిని గుర్తు చేసినప్పుడు నీదైవిక శక్తులు మరల పొందుతావని శాపవిమోచనం చేస్తాడు. హనుమంతుడు లంకానగారానికి లంఘించడానికి శంకిస్తునప్పుడు జాంబవంతుడు ఇతనిలో వున్న శక్తిని తెలిపినప్పటి నుండి తన పుర్వశక్తి అతనికి వస్తుంది.





Untitled Document
Advertisements