కామధేనువు దిలీపుడ్ని శపించింది ఎందుకు?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 01:11 PM

కామధేనువు దిలీపుడ్ని శపించింది ఎందుకు?

దిలీపుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ప్రసిద్ద రాజుల్లో ఒకడు. ఇతడి కాలంలో రాజ్యం సుభిక్షంగా వున్నా ఇతడు సంతానం లేక భాదపడుతూ తమ కుల గురువైన వసిష్టుడ్ని కారణం చెప్పమనగా అతడు తన దివ్యదృష్టితో కామధేనువు శాపమని గ్రహించి కారణం వివరించాడు. ఒకసారి దీలిపుడు ఇంద్రుణ్ణి చూడటానికి వెళ్లి తిరిగి వస్తూ కల్పవృక్షం క్రిందవున్న కామధేనువును గమనించలేదు. అప్పుడు కామ ధేనువు తనపట్ల దిలీపుడు అగౌరవపరిచాడని తలచి తన కూతురు నందినినైనా దిలీపుడు పూజిస్తే తప్ప అతనికి సంతానం కలుగదని శపించింది. దిలీపుడికి ఈ విషయం తెలియలేదు. కామధేనువు ఓ యజ్ఞం కొరకు పాతాళానికి వెళ్ళింది. ఆ సమయమున నందినిని పూజించాలని దిలీపుడు వశిష్టుని కోరిక పై తలచాడు. దిలీపుడు, అతని భార్య నందిని వెనుకే వుంటూ దాన్ని పూజించారు. ఒకరోజు అనుకోకుండా అది ఒక గుహలోకి వెళ్ళగా దానివెంట దిలీపుడు వెళ్ళాడు. అక్కడో సింహం నందినిని చంపబోగా దిలీపుడు విల్లు ఎక్కుపెట్టగా చేతులు కదలలేదు. సింహం ఇది తన ఆహారమని కనుక నీవు రక్షించడానికి వీల్లేదని చెప్పగా తనను భుజించి నందినిని విడువమని ప్రార్థిస్తాడు. సింహం మాయమైయి నందినిని, నిన్ను పరీక్షించడానికి నేనే ఈ నాటకమాడాను అని అంటుంది. తరువాత అతనితో పాటు నందిని తన ఆశ్రమానికి వచ్చి దిలీప దంపతులకు సంతానం కలిగేటట్లు వరమిస్తుంది. వారికి కల్గిన పుత్రుడే ప్రసిద్ది గాంచిన రఘు మహారాజు. ఇక్కడి నుండే ఈ వంశానికి రఘువంశమని పేరు వచ్చింది.





Untitled Document
Advertisements