ఆధార్ నంబర్ తో బ్యాంక్ అకౌంట్ హ్యాక్?!

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 04:17 PM

ఆధార్ నంబర్ తో బ్యాంక్ అకౌంట్ హ్యాక్?!

ఆర్థిక అంశాలకు చెందిన వివరాలు ఎవ్వరికీ తెలియజేయవద్దు. ఒకవేళ ఇలా చేస్తే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావొచ్చు. అందువల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పొచ్చు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. ఆధార్ నెంబర్ ఎవరికైనా తెలిస్తే.. ప్రమాదం ఉంటుందా? అని చాలా మందికి అనుమాన ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటారా? బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ కావడం వల్ల ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేస్తారా? అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఈ అంశంపై యూఐడీఏఐ స్పస్టత ఇచ్చింది. ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయడం వీలుకాదని తెలిపింది. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరని పేర్కొంది.

అయితే ఓటీపీ, పిన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటివి ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చని హెచ్చరించింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.





Untitled Document
Advertisements