ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 05:05 PM

ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ  వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో 2021 జూలై 28వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాంలో సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో సైతం, సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకటి లేక రెండు చోట్ల భారీ కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. అలాగే, రాయలసీమలో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి లేక రెండు చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements