నాసెన్స్ రసాయన పరిశ్రమలో ప్రమాదం

     Written by : smtv Desk | Wed, Jul 28, 2021, 11:19 AM

నాసెన్స్ రసాయన పరిశ్రమలో ప్రమాదం

హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Untitled Document
Advertisements