మరో పెళ్ళికి సిద్దమైన హీరో సుమంత్

     Written by : smtv Desk | Wed, Jul 28, 2021, 01:46 PM

మరో పెళ్ళికి సిద్దమైన హీరో సుమంత్

హీరో సుమంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడా? పెళ్లి కూడా అతి త్వరలోనే జరగబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడని, తమ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన పవిత్ర అనే ఓ వ్యాపారి కూతురిని పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పెళ్లి పనులను కూడా మొదలుపెట్టేశారన్న చర్చ నడుస్తోంది. పెళ్లి కార్డులనూ పంచారని సమాచారం. ఆ పెళ్లికార్డే ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. వధూవరుల పేర్లు హైలైట్ అయ్యేలా ‘ఎస్ పీ’ అనే అక్షరాలను పెద్దగా కూర్చి పెళ్లి కార్డును డిజైన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలోనే పెళ్లి తంతు జరిపించేస్తున్నారని తెలుస్తోంది.


అంతకుముందు 2004లో కీర్తిరెడ్డిని సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, మనస్ఫర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రేమకథ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుమంత్ .. సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలతో హిట్లు సాధించారు. ఇటీవలే విడుదలైన 'కపటధారి' సినిమాతోనూ మెప్పించాడు. తాజాగా 'అనగనగా ఒక రౌడీ' సినిమా చేశాడు. మేలో షూటింగ్ నూ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయి.

Untitled Document
Advertisements