శునకానికి ఐసీసీ పురస్కారం...వైరల్ వీడియో

     Written by : smtv Desk | Tue, Sep 14, 2021, 11:17 AM

శునకానికి ఐసీసీ పురస్కారం...వైరల్ వీడియో

ఐసీసీ పురస్కారం శునకానికా.. అని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజమే. ఐసీసీ ప్రతినెల క్రికెటర్లకు పురస్కారాలు ప్రకటించడం పరిపాటి. అయితే, ఈసారి అందులో ఓ శునకం కూడా చోటు సంపాదించుకుంది. ఓ ప్రత్యేక పురస్కారంతో ఐసీసీ దానిని సత్కరించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐర్లండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ శునకం బంతిని నోటితో పట్టుకుని పరుగులు తీసింది. దానిని అలా పట్టుకుని పరిగెడుతూ చివరికి బ్యాటర్ వద్దకెళ్లి ఆ బంతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

దీంతో స్పందించిన ఐసీసీ.. బ్యాటర్‌కు బంతి అందించి, అందరి మనసులు చూరగొన్న ఆ శునకాన్ని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. నోటితో బంతి, తలపై టోపీతో ఉన్న శునకం ఫొటోను ఐసీసీ ఈ సందర్భంగా షేర్ చేసింది.







Untitled Document
Advertisements