ఎస్‌బీఐ గుడ్ న్యూస్... సులభంగా రుణాలు

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:04 PM

ఎస్‌బీఐ గుడ్ న్యూస్... సులభంగా రుణాలు

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కీలక నిర్ణయం తీసుకుంది. పలు మైక్రోఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కో-లెండింగ్ కోసం బ్యాంక్ ఈవిధంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో జతకట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రుణాలు అందుబాటులోకి రానున్నాయి.

వేదిక క్రెడిట్ క్యాపిటల్, సేవ్ మైక్రోఫైనాన్స్, పైసాలో డిజిటల్ అనే మూడు మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో ఎస్‌బీఐ జత కట్టింది. ఈ భాగస్వామ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌బీఐ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. చాలా మందికి చిన్న మొత్తంలో రుణాలు సులభంగా లభించనున్నాయి.

ఫామ్ మెకనైజేషన్, వేర్‌హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటి వాటికి రుణాలు అందించేందుకు బ్యాంక్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల భాగస్వామ్యంతో ఎస్‌బీఐ రుణాలు వీరికి అందుబాటులోకి రానున్నాయి.





Untitled Document
Advertisements