ఆర్‌బీఐ కీలక నిర్ణయం...రుణ గ్రహీతలకు ఊరట

     Written by : smtv Desk | Fri, Oct 08, 2021, 11:16 AM

ఆర్‌బీఐ కీలక నిర్ణయం...రుణ గ్రహీతలకు ఊరట

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. తాజా ద్రవ్యపరపతి సమీక్షలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ నిర్ణయం వల్ల కీలక రెపో రేటు స్థిరంగానే కొనసాగింది. రెపో రేటు 4 శాతం వద్దనే కొనసాగుతోంది. రివర్స్ రెపో రేటు 3.5 శాతం ఉంది. వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఈ ఏడాది 9.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం సీపీఐ 5.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. గత పాలసీ సమీక్షతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయని అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements