ఈ స్కీమ్ తో నెలకు రూ.లక్షన్నర పెన్షన్!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 11:25 AM

ఈ స్కీమ్ తో నెలకు రూ.లక్షన్నర పెన్షన్!

మీరు ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావిస్తున్నారా? అది కూడా రూ.లక్షన్నర వస్తే బాగుంటుందని ఆలోచిస్తు్న్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్. NPS స్కీ్‌మ్‌లో చేరడం వల్ల ప్రతి నెలా రూ.లక్షన్నర పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్‌పీఎస్ స్కీమ్‌ నిర్వహణ బాధ్యతలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA చూసుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎవరైనా సరే ఈ పథకంలో చేరొచ్చు.

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరే వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మెచ్యూరిటీ అమౌంట్‌లో కనీసం 40 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 60 శాతం తీసుకోవచ్చు. ఇలా పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన డబ్బులతో ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. 100 శాతం ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ డబ్బులను కూడా పెన్షన్ స్కీమ్‌లో పెట్టొచ్చు.

ఎన్‌పీఎస్ అకౌంట్‌లో 30 ఏళ్ల పాటు నెలకు రూ.12 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా రూ.1.78 లక్షల పెన్షన్ పొందొచ్చు. ఎలా అంటే.. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.1.64 కోట్లు (60 శాతం) వస్తాయి. మిగతా 40 శాతం రూ.1.04 కోట్లను యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాలి. దీని ద్వారా నెలకు రూ.54,700 పెన్షన్ వస్తుంది. 60 శాతం మొత్తాన్ని సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్‌లో 25 ఏళ్ల కాల పరిమితితో పెట్టాలి. ఇప్పుడు నెలకు రూ.1.23 లక్షలు వస్తాయి. అంటే నెలకు రూ.1.7 లక్షలు పొందొచ్చు.





Untitled Document
Advertisements