సద్దుల బతుకమ్మ పండుగపై పండితుల క్లారిటీ

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 12:17 PM

సద్దుల బతుకమ్మ పండుగపై పండితుల క్లారిటీ

బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. ఎంగిల పూలతో సంబురం మొదలైంది. మహిళలు తీరొక్క పూలతో వీధివీధిన బతుకమ్మను కొలుస్తున్నారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. వాస్తవానికి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది మాత్రం కాస్త గందరగోళం నెలకొంది.

దీనిపై ప్రజల్లో కూడా సందేహాలు ఉన్నాయి. అయితే వేద పండితులు విస్తృతంగా చర్చించి ఈ నెల 13న (బుధవారం) సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్ర సర్కార్ కూడా 13వ తేదీనే సద్దుల బతుకమ్మ పండుగ అని ఖరారు చేసింది. కొందరు సిద్ధాంతులు మాత్రం బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా శాస్త్రాల్లో ఎక్కడా లేనందున కచ్చితంగా తేదీలు చెప్పలేమని అంటున్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకునే సంప్రదాయం ఉందని వాదిస్తున్నారు.





Untitled Document
Advertisements