బృందావనంలో వత్సాసుర వధ!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 01:22 PM

బృందావనంలో వత్సాసుర వధ!

రేపల్లెలో కృష్ణుడికి రోజుకు ఒక గండంగా గడుస్తూ ఉండడంతో యశోదానందులు భయపడి రేపల్లె నుండి బృందావనానికి వలస వెళ్ళిపోయారు. అక్కడి గోపబాలకులు అందరూ కూడా బలరామకృష్ణులకు తొందరలోనే స్నేహితులైపోయారు. బృందావనానికి వలస వెళ్ళారని తెలుసుకొని కంసుడు అక్కడికి కూడా కృష్ణుని చంపడానికి వత్సాసురుడు, బకాసురుడు అనే ఇద్దరు రాక్షసులను బృందావనానికి పంపాడు.
కృష్ణుడు బృందావనంలో స్నేహితులతో ఆడుకుంటుండగా కోడె గిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. ఆ కోడె గిత్త ని చూడగానే కృష్ణుడు వాడు రాక్షసుడు అని పసిగట్టాడు. తానే కావాలని ఆ గిత్త దగ్గరకు వెళ్లాడు. కోడెగిత్త రూపంలో ఉన్నా వత్సాసురుడు సంతోషంతో " భలే దొరికాడు వెర్రి  కృష్ణుడు కొంచెం సేపు అమాయకంగా నిలబడి ఒక కుమ్ముకుమ్మి చంపేద్దాం" అని మనసులో అనుకున్నాడు. కానీ, ఎవరూ ఊహించలేని విధంగా కృష్ణుడు హఠాత్తుగా ఆ కోడె గిత్త నాలుగు కాళ్లు కలిపి పట్టుకుని పైకి ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. ఈ హఠాత్పరిణామానికి వత్సాసురుడు చావు కేక పెట్టి చచ్చే ముందు నిజస్వరూపం అయిన రాక్షసుడిగా మారి గిలగిల తన్నుకొని ప్రాణాలు వదిలాడు. ఆ సంఘటన చూసిన కృష్ణుడి మిత్రులంతా సంతోషంతో జయజయధ్వానాలు చేశారు.





Untitled Document
Advertisements