'అయ్యయ్యో వద్దమ్మా' శరత్‌పై దాడి...హిజ్రాల పనేనన్న అనుమానం!

     Written by : smtv Desk | Tue, Oct 19, 2021, 10:17 AM

'అయ్యయ్యో వద్దమ్మా' శరత్‌పై దాడి...హిజ్రాల పనేనన్న అనుమానం!

‘అయ్యయ్యో వద్దమ్మా’ అంటూ ఓవర్‌ నైట్‌లో సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయాడు హైదరాబాదీ కుర్రాడు ‘శరత్‌’. అయితే ఆ వీడియోనే ఇప్పుడు అతడికి చిక్కులు తెచ్చిపడింది.

శరత్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ముక్కు నుంచి రక్తం కారుతున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలు చూస్తుంటే అతడికి తీవ్రగాయాలు అయినట్లుగా కనిపిస్తోంది. అయితే శరత్‌పై దాడికి పాల్పడాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అతడికి వచ్చిన పబ్లిసిటీ ఓర్వలేకే ఎవరో దాడి చేశారని కొందరు, హిజ్రాలను అవమానించేలా వీడియో తీసినందుకు వాళ్లే తీవ్రంగా కొట్టి ఉండొచ్చన్ని సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. హిజ్రాలపై గౌరవం పెరిగేలా ఒక టీపొడి కంపెనీ యాడ్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ టీ పొడి యాడ్‌ను శరత్‌ రీమేక్‌ చేస్తూ తీన్మార్‌ డాన్సులు చేసిన వీడియో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే ఈ వీడియో ద్వారా అతడు తమను కించపరిచాడన్న భావనతో హిజ్రాలే శరత్‌పై దాడి చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. అతడిపై జరిగిన దాడిని కొందరు ఎంజాయ్‌ చేస్తూ మీమ్స్ కూడా చేస్తున్నారు. అయితే దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు అన్న దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. మరోవైపు దాడి జరిగినట్లు చెప్తున్న వ్యక్తి డాన్సర్‌ శరత్‌ కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

Untitled Document
Advertisements