శివుడి చాపం సీతాస్వయంవరం వరకు ఏవిధంగా చేరింది!

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 12:37 PM

శివుడి చాపం సీతాస్వయంవరం వరకు ఏవిధంగా చేరింది!

విశ్వకర్మ శివుడి కోసం చేసి ఇచ్చిన ధనస్సు ఈ శివ చాపం. దక్షుడు యజ్ఞం నిర్వహిస్తూ తన కుమార్తె అయినా శక్తిని శివునిపై కోపంతో పిలవలేదు. పిలవని యజ్ఞానికి వచ్చిన కుమార్తెను దక్షుడు దూషించగా యోగాగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది శక్తి. భార్యకు జరిగిన అవమానం మరియు భార్య ప్రాణ త్యాగం గురించి తెలిసిన శివుడు ఉగ్రుడై తనకు విశ్వకర్మ తయారు చేసి ఇచ్చిన ధనస్సుతో దానవుల్ని దేవతల్ని కూడా బాధిస్తాడు. దేవతలు శరణు వేడగా శివుడు ఆ ధనుస్సు దేవతలికివ్వగా వారు నిమి సంతతివాడైనా దేవరాతుడికిస్తారు. అది చివరకు జనుకుని నగరమైన మిధిల చేరుతుంది. ఆ శివధనుస్సుని సీతాస్వయంవర సమయములో శ్రీరాముడు విరుస్తాడు.

Untitled Document
Advertisements