కొబ్బరి నీరులోని పోషకవిలువలు!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:37 PM

కొబ్బరి నీరులోని పోషకవిలువలు!

కొబ్బరి నీరు ప్రకృతి ఇచ్చిన వరం. అన్నీ చల్లటి తాగే పానీయాల కంటే అతి ముఖ్యమైనది కొబ్బరి నీరు. కొబ్బరినీరు వర్షాకాలం చలికాలంలో కూడా వాడుకోవచ్చు. చాలా పోషక విలువలు కొబ్బరినీళ్ళలో కలవు. కొబ్బరి నీళ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. ఈ నీళ్లలో రాగి ఫాస్పరస్ వంటి ధాతువులు ఉండటం వలన శరీరంలో లవణాల సమతుల్యత చక్కగా కొనసాగుతుంది. మన శరీరానికి రోజువారి అవసరమైన విటమిన్ 'సి' ఒక కొబ్బరి బొండం నీటిలో ఉంటుంది. నీయాసిక్, ప్యాటియానిక్ ఆమ్లము, బయోటిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ ఆమ్లములు, థైమిన్ వంటి 'బి' గ్రూప్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. స్పోర్ట్స్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్ కన్న ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కొబ్బరి నీరు అన్నిటికంటే మెరుగైనదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే కొబ్బరి బొండం నీళ్ళు తాగి దానిలో ఉన్న కొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహార లోపం లేకుండా కాపాడుతుంది.

Untitled Document
Advertisements