క్లెన్సర్ ఎలా వాడాలి!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 03:56 PM

క్లెన్సర్ ఎలా వాడాలి!

ఉదయం ఒకసారి రాత్రి, ఒకసారి తప్పనిసరిగా ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మం కలవారు అయితే ఒకసారి ఆస్ట్రిజెంట్ తోనూ మరొకసారి క్లెన్సర్ తోనూ శుభ్రం చేసుకోవడం మంచిది.
పొడిచర్మం గలవారు రోజుకు ఒకసారి పాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
నార్మల్ స్కిన్ అయితే వారానికి ఒకసారి ఆయిల్ స్కిన్ అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావు.
తక్కువ గాఢత కలిగిన సబ్బుతో కానీ, సున్నిపిండితో కానీ స్నానం చేయవచ్చు. చందనం పొడిలో పన్నీరు నాలుగైదు చుక్కల పాలు కలిపి శరీరానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేడినీళ్ళతో స్నానం చేసినా బావుంటుంది.
శరీరానికి పాలతో మసాజ్ చేసుకుంటే శరీరం మృదువుగా మారుతుంది.
ఒక కప్పు నీటిలో నాలుగైదు చుక్కల ఆరోమా ఆయిల్ కలిపి చల్లుకుంటే శరీరం సువాసనలు వెదజల్లుతుంది.
కొబ్బరి నీళ్ళు పైనాపిల్ రసం కలిపి శరీరానికి పట్టించవచ్చు. అలాగే వేన్నిగర్, పన్నీరు సమపాళ్లలో తీసుకుని కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయవచ్చు.
ఎక్కువగా చెమట పడుతుంటే కరక్కాయలను మెత్తగా దంచి మంచినీళ్లతో మెత్తగా నూరి పొట్టకు, శరీరానికి లేపనంగా వేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
స్నానానికి ముందు పచ్చి పసుపులో పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.

Untitled Document
Advertisements