యోగాతో ఆరోగ్యం మీ సొంతం!

     Written by : smtv Desk | Fri, Nov 26, 2021, 12:07 PM

యోగాతో ఆరోగ్యం మీ సొంతం!

యోగా వల్ల ఎంత ఉపయోగమో ప్రతి ఒక్కరు తెలుసుకుని, నేర్చుకుని ఆచరించడం వలన మంచి ఫలితాలు మనకు స్వయంగా అనుభవంలోకి వస్తాయి. యోగా గురించి తెలియని వారు కొందరైతే నేర్చుకుని సరిగా ఆచరించని వారు కొందరు. యోగా, ఆహార నియమాలు, సత్ ప్రవర్తన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ రోజులలో సంపాదనే ముఖ్యమని భావిస్తున్నారు. ఆహార నియమాలు లేవు తద్వారా అనారోగ్యం ఏరి కోరి మరీ తెచ్చుకుంటున్నారు. మన పూర్వికులు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. కాని పెద్దలమాట విని ఆచరణలో పెట్టడం లేదని మనకు తెలుసు. కానీ మనస్సు వేరు, శరీరం వేరు . మానసిక రోగాలు 60%, శారీరక రోగాలు 40% వరకు రోగాలు యోగాతో నయం చేయవచ్చు. యోగాలో ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు అన్నీ కలిస్తేనే యోగా అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు అన్ని రకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. అటువంటి వారిని వ్యసనాల బారి నుండి రక్షించి ఆరోగ్యవంతమైన జీవితం గడిపేలా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం..
* యోగా వల్ల శరీరానికి, మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది.
* ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
* మందుల ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది.
* మానసిక ప్రశాంతత వలన ఒత్తిడి మాయమై చేసే పనిమీద ఏకాగ్రత ఏర్పడుతుంది.
* మంచి ప్రవర్తన ఏర్పడుతుంది.
* వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా రాకుండా వుంటాయి.
* ఇక ముందు వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతుంది.
* రోగమనే భయం పోతుంది. మానసిక ధైర్యం చేకూరుతుంది.
* ఎలాంటి పనినైనా ఏకాగ్రతతో సునాయాసంగా చేయగల్గుతారు.
* అలసట రాదు, ఎక్కువ కాలం పని చేయగల్గుతారు.
* వ్యసనాల బారిన పడ్డవారు యోగా ఆచరిస్తే వ్యసనాలకు దూరం కాగలుగుతారు.
* శరీరం దృడంగా అవుతుంది.
* నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుంది.
* ప్రాణాయామం ద్వారా ప్రాణ శక్తి వస్తుంది. ఆసిజన్ లోపం ఏర్పడదు.
* అరికాళ్ళ నుండి జుట్టు వరకు ఉన్న అన్ని రోగాలు నశిస్తాయి.
* చనిపోయే వరకు మన పని మనమే చేసుకోగలుగుతాము.
* ఆరోగ్యంతో పాటు ఆయువు పెరుగుతుంది.
* ధ్యానం వలన మానసిక ఒత్తిడి తగ్గి రోగాలు తగ్గుతాయి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు.
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా వృద్ది చెందుతుంది.
* ధ్యానం వలన విశ్వ శక్తి మన శరీరంలోకి వస్తుంది.
* ఎంత వయస్సు ఉంటె అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఎలా చేస్తే బీ.పీ అదుపులో ఉంటుంది.
* ధ్యానం వలన హార్మోన్స్ బ్యాలెన్స్గా వుంటాయి.
* అదుపులో వున్నా మనస్సు మన బంధువుగా, అదుపు తప్పిన మనస్సు మనకు శత్రువుగా వుంటాయి. ధ్యానం ద్వారా మన మనస్సు అదుపు తప్పకుండా మన బంధుగా మారుతుంది.

Untitled Document
Advertisements