అదృష్టం, ఆరోగ్యం రెండు మీ అరచేతిలోనే !

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:09 PM

అదృష్టం, ఆరోగ్యం రెండు మీ అరచేతిలోనే !

మాములుగా మన అరచేతిని చూసి జాతకం చెప్పడం మనకి తెలుసు. అయితే అరచేతిని చూసి జతకంతో పాటు మన ఆరోగ్యం గురిచి కూడా తెలిసిపోతుందట. మన శరీరంలోని కొన్ని అవయవాలు.. అనారోగ్యం గురించే ముందే హెచ్చరిస్తాయట. అయితే, దీని గురించి చాలామందికి అవగాహన ఉండదు. తరచుగా వచ్చే తలనొప్పి.. మన మెదడులోని సమస్యలు గురించి ఎలా హెచ్చరిస్తుందో.. రంగులు మారే అరచేతులు సైతం కొన్ని రకాల రోగాలను సూచిస్తాయట. హస్తసాముద్రిక పండితులు కొందరి చేతులను బట్టి.. వారి వ్యక్తిత్వం, అనారోగ్య పరిస్థితులను ముందుగానే అంచనా వేయగలుగుతున్నామని చెబుతున్నారు. మరి అర చేతులు ఏ రంగులో ఉంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయి? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందామా!
❂ అరచేతులు ఎరుపు రంగులో ఉంటే అసౌకర్యంగా ఫీలవ్వుతారు. ఇలాంటివారికి ఇది గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువట. అరచేతులు ముదురు ఎరుపు రంగులోకి మారితే ఇది మెడడులోని రక్తస్రావానికి సంకేతమట. ఆస్థమా, కరోనరీ ధమనుల సమస్య, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులకు ఈ రంగు సంకేతమట. ఒకవేళ అధిక మద్యపానం, పని ఒత్తిడి, ఆలస్యంగా నిద్రపోవడం వంటి కారణాల వల్ల చేతులు ఎర్రగా మారితే.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదట.
❂ అరచేతులు గులాబీ రంగులో మారితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంట. గులాబీ రంగు అరచేతులు గలవారు చాలా అదృష్టవంతులట. వీరు చేపట్టిన పనుల్లో కొద్దిపాటి శ్రమతోనే విజయం సాధిస్తారట. వీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులట.
❂ అరచేతులు తెల్లగా ఉంటేవారు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లని అంటున్నారు. చేతి వేళ్లు సైతం తెల్లగా ఉన్నట్లయితే లో-బీపీగా భావిస్తారు. అరచేతిలో మధ్య భాగం తెల్లగా ఉంటే అది తీవ్రమైన ఉదర సంబంధ వ్యాధికి సంకేతమట.
❂ అరచేతులు నీలం రంగులోకి మారితే జాగ్రత్తగా ఉండాలి. నీలం రంగు అరచేతులు గల వ్యక్తుల భయస్తులని హస్త సాముద్రిక పండింతులు భావిస్తారు. బీరు చాలా భిన్నంగా ఉంటారట. వీరు ఇతరులపై అతిగా ఆధారపడతారు. రక్త ప్రసరణ తగ్గినప్పుడు చేతులు ఇలా నీలం రంగులో మారతాయట. ఇలాంటివారు గుండె, ఉదర సంబంధ, అజీర్తి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందట.
❂ అరచేతులు పసుపు పచ్చగా ఉండే వ్యక్తులను కష్టజీవులుగా భావిస్తారు. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారట. వీరు పిత్తాశయ, ప్యాంకియాట్రిక్ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయట. పిత్తాశయ వాహిక క్యాన్సర్ లక్షణాలు ఉండేవారి చేతులు కూడా పసుపు రంగులోకి మారతాయట.
❂ అర చేతులు నల్ల రంగులో మారే వ్యక్తులను నిత్యం అనారోగ్యం వెంటాడుతుందట. సంపద విషయంలో కూడా వీరిని బ్యాడ్‌లక్ వెంటాడుతుందంట. రక్తహీనత, అధిక రక్తపోటు, ఉదర సంబంధ రోగాలు వీరిలో అధికమట.
❂ కొందరు అర చేతులు మెరుస్తున్నట్లుగా కాంతివంతంగా ఉంటాయి. వీరు బాగా సంపాదిస్తారట. చేపట్టిన పనుల్లో కూడా వీరు విజయం సాధిస్తారట. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారట. అయితే, ఇలాంటివారిలో గుండె పనితీరు నెమ్మదిగా ఉంటుందట. కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు కూడా వీరిని వెంటాడుతాయట.మీ అరచేతులు భవిష్యత్తే కాదు, ఆరోగ్యాన్ని కూడా చెప్పేస్తాయట!

Untitled Document
Advertisements