ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం..

     Written by : smtv Desk | Sat, May 07, 2022, 04:34 PM

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడపడితే అక్కడ కాలిపోవడం బ్యాటరీలు పేలిపోవడం సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనాల తయారీ సంస్థ లకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్ల నేపథ్యంలో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసిన కమిటీ ఈ ఎలక్ట్రిక్ వాహనాల లో ఉపయోగించే బ్యాటరీ తయారీ లో లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది అంతేకాక బ్యాటరీ డిజైనింగ్ మరియు సెల్స్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కమిటీ తేల్చి చెప్పేసింది. అయితే ఈ ప్రమాదాల కు సంబంధించి ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లైన ఓకినోవా మరియు ఓలా సంస్థలు ఇప్పటికే తమ బైకులనురీకాల్ చేశాయి. వానల తయారీలో లోపాలుంటే ఇకపై ఆ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో వాహనాలతయారీఆయా కంపెనీలు జాగ్రత్తగా తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి.





Untitled Document
Advertisements