యాపిల్ ఐపాడ్ టచ్ ను నిలిపివేయనున్న యాపిల్ సంస్థ

     Written by : smtv Desk | Wed, May 11, 2022, 12:49 PM

యాపిల్ ఐపాడ్ టచ్ ను నిలిపివేయనున్న యాపిల్ సంస్థ

స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ ఐ ఫోన్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి అలాంటి యాపిల్ సంస్థ 20 ఏళ్ల తర్వాత యాపిల్ ఐపాడ్ టచ్ ను నిలిపివేసింది. 2001లో ఐపాడ్ టచ్ ను యాపిల్ ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతం ఐపాడ్ టచ్ స్టాక్ ఉన్నంత వరకే అమ్మకాలు కొనసాగుతాయని.. అనంతరం ఈ ఉత్పత్తి ఇక అందుబాటులో ఉండదని యాపిల్ ప్రకటన విడుదల చేసింది.
ఐపాడ్ స్ఫూర్తి కంపెనీకి చెందిన ఇతర ఉత్పత్తుల్లో ప్రతి ఫలిస్తుందని యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్విక్ ప్రకటించారు. సంగీతం అన్నది యాపిల్ ఉత్పత్తుల్లో అంతర్లీనంగా ఉంటుందన్నారు. సంగీత పరిశ్రమ కంటే మించి వందలాది మిలియన్లపై యాపిల్ ఐపాడ్ ప్రభావం చూపించినట్టు పేర్కొన్నారు. సంగీత అన్వేషణ, ఆస్వాదన, పంచుకోవడాన్ని ఐపాడ్ మార్చేసిందన్నారు.
చేతిలో ఒదిగిపోవడం, టచ్ తో నచ్చిన పాటలను ఎంపిక చేసుకుని వినడం.. ఈ సౌకర్యం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఐపాడ్ టచ్ ను చేరువ చేసింది. దీంతో యాపిల్ కు కీలక ఉత్పత్తుల్లో ఒకటిగా ఇది అమ్మకాలు సాగించింది. కానీ స్మార్ట్ ఫోన్ల రాక తర్వాత ఐపాడ్ టచ్ కు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. చివరికి నిలిపివేతకు దారితీసింది.





Untitled Document
Advertisements