ఐపిఎల్ లో చిరకాల ప్రత్యర్థుల పోరు .. ఈ మ్యాచ్ లోనైనా ముంబై గెలవనుందా ..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 12:33 PM

ఐపిఎల్ లో చిరకాల ప్రత్యర్థుల పోరు .. ఈ మ్యాచ్ లోనైనా ముంబై గెలవనుందా ..

ప్రపంచ క్రికెట్లో దాయాదుల సంగ్రామం తర్వాత ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ల మద్య మ్యాచ్ అంతే రసవత్తరంగా జరుగుతుంటుంది. ప్రతి ఐపిఎల్ సీజన్లో ఈ రెండు జట్ల మద్య ఆట ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. అయితే ఈసారి ఐపిఎల్ సీజన్లో ముబి ఇండియాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే నేడు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ జరగబోతుండగా.ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది .తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం నాల్గింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబయి టీమ్ ఆడిన 11 మ్యాచ్‌లకిగానూ.. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉంది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ని దెబ్బ తీసేందుకు ముంబై ఇండియన్స్ తయారైంది. అయితే నేడు ముంబై మరియు చెన్నై జట్లు ఇలా ఉండనున్నాయి .
ముంబై ఇండియన్స్ (అంచనా ) : రోహిత్ శర్మ (కెప్టెన్ ) , ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), తిలక్ వర్మ ,దేవల్ద్ బ్రేవిస్ , కీరన్ పోల్లర్డ్ , టిమ్ డేవిడ్ ,డేనియల్ సామ్స్ , మురుగన్ అశ్విన్ ,జయదేవ్ ఉనద్కాట్ , జస్ప్రిట్ భుమ్ర, బసిల్ తంపి
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా) : రుతురాజ్ గైక్వాడ్ , డి కన్వే ,రాబిన్ ఉతప్ప , అంబటి రాయుడు,శివమ్ దుబే , ఎం ఎస్ ధోని(కెప్టెన్ / వికెట్ కీపర్) , బ్రేవో , తీక్షణ ,ముఖేష్ చౌదరి , ప్రెతొరియస్, సంట్నేర్ ,





Untitled Document
Advertisements