ట్విట్టర్ అమ్మకం కొనుగోలు పై ట్విట్టర్ వేదికగానే వాదనలు!

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 11:50 AM

ట్విట్టర్ అమ్మకం కొనుగోలు పై ట్విట్టర్ వేదికగానే వాదనలు!

గతకొంత కాలంగా టెస్లా మరియు స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వార్తల్లో నిలుస్తున్నారు. కారణం సామాజిక మాధ్యమాలలో ఒకటైన ట్విట్టర్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలే ఆయనని వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. అయితే మస్క్ ట్విట్టర్ ను కొనుగులు చేయడం పై రోజు రోజుకు వెనక్కి తగ్గుతున్నాడు అనిపిస్తుంది. దానికి కారణం ట్విట్టర్ లోని ఫేక్ ఎకౌంటుల గురించి తనకు ముందుగా తెలియలేదని మొండికేస్తున్నాడు. ఆయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే ఇక ఎలోన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు అసాధ్యమేనని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్విట్టర్లో నిజమైన ఖాతాదారుల సంఖ్యను బట్టే తాను ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చినట్టు ఎలాన్ మస్క్ తెలిపాడు. తాను ట్విట్టర్ కొనుగోలుకు ముందుకు రావాలంటే ఈ ఫేక్ ఖాతాలపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సిందేనని తేల్చిచెబుతున్నాడు. 20 శాతం ఫేక్ ఖాతాలు ఉన్న సంస్థకు అంత డబ్బు పెట్టి కొనేది లేదని బల్లగుద్ది చెబుతున్నాడు. ఈ ట్విట్టర్ ఫేక్ ఖాతాలకు సంబంధించి ఎలాన్ మస్క్ పరాగ్ అగర్వాల్ మధ్య ట్వీట్ల రూపంలో వార్ నడుస్తోంది. ఇందుకు వివాదానికి మూలకారణమైన ట్విట్టరే వేదికగా నిలవడం గమనించదగిన విషయం. ట్విట్టర్ ఖాతాల్లో 5 శాతం మాత్రమే ఫేక్ ఖాతాలని పరాగ్ చెబుతున్నదానితో తాను ఏకీభవించనని మస్క్ అంటున్నాడు. పరాగ్ చెప్పినదాని కంటే నాలుగు రెట్లు అధికంగా అంటే 20 శాతం వరకు ఫేక్ ఖాతాలు ట్విట్టర్లో ఉన్నాయని మస్క్ చెబుతున్నాడు. అయితే వ్యక్తులు నిత్యం రకరకాల ఫేక్ పేర్లతో ట్విట్టర్లో ఖాతాలు తెరుస్తున్నారని అంటున్నాడు పరాగ్ . ఈ ఫేక్ ఖాతాలను కనుక్కుని వెంటనే వాటిని తొలగించడం సాధ్యం కాదని ఆయన పేర్కొంటున్నాడు. ఎన్ని ఫేక్ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి బయట వ్యక్తులను అనుమతించబోమని పరాగ్ చెబుతుండటం వివాదానికి దారితీసింది. ట్విటర్లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ పరాగ్ అగర్వాల్ అనేక ట్వీట్లు చేశాడు. అయితే వాటన్నింటికి వ్యంగ్యంగా స్పందిస్తూ ఒక ఎమోజీని పరాగ్ అగర్వాల్ ట్వీట్లకు రిప్లైగా ఇచ్చాడు ఎలాన్ మస్క్. అయితే ట్విట్టర్ అమ్మకం కొనుగోలు పై ట్విట్టర్ వేదిక్గానే వాదనలు జరగడం అనేది అందరిని ఆకట్టుకునే విషయమే .






Untitled Document
Advertisements