కోనసీమ జిల్లాలో వారం రోజులపాటు 144 సెక్షన్ ..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 11:39 AM

కోనసీమ జిల్లాలో వారం రోజులపాటు 144 సెక్షన్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఇది కూడా ఆ రాష్ట్రంలో కొన్ని అల్లర్లకు దారీ తీసింది . అయితే జిల్లాల పేర్ల మార్పు వ్యతిరేఖిస్తూ లేదా జిల్లాకు ఈ పేరును పెట్టాలని రాష్ట్రంలో అక్కడక్కడా నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే .. అయితే కోనసీమ జిల్లాలో ఏకంగా 144 సెక్షన్ ఏర్పాటుకు కారణం అయింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. కావున పోలీస్ శాఖ అప్రమత్తమయ్యి ముందుగానే కోనసీమ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపడం జరిగింది. అయితే 144 సెక్షన్ ను అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కాట్రేనికోన, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో విధించినట్లు గా ఎస్పి పేర్కొన్నారు. కావున ఎవరు బహిరంగసభలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించకూడదని అలా నిర్వహించిన వారిపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.





Untitled Document
Advertisements