ఐఏఎన్ఎస్ - సి ఓటర్ సర్వేలో ప్రధాని మోడీ కంటే టాప్ లో రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 01:21 PM

ఐఏఎన్ఎస్ - సి ఓటర్ సర్వేలో  ప్రధాని మోడీ కంటే  టాప్  లో   రాహుల్ గాంధీ

వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభతో తెలంగాణా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే .. అంతేకాక రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ శిబిర్ కార్యక్రమంతో కొంత వరకు ముందుకు వెళ్తుందనే అనుకున్నారు. కాని ఈ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారటా .. ఏకంగా భారత ప్రధానమంత్రిని వెనక్కి నెట్టేసి మరి ఇండో ఏసియన్ న్యూస్ సర్వీస్ నిర్వహించిన సి ఓటర్ తాజా సర్వేలో 54 శాతానికి పైగా ప్రజలు రాహుల్ గాంధీని తమ ప్రధాన మంత్రిగా అంగీకరించారు. కాగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని కేవలం 24 శాతం మంది తమ ప్రధానిగా ఒప్పుకున్నారు. ఎప్పటి నుంచో దక్షిణ భారతదేశంలో అంత అంత మాత్రమే బీజేపీ ఉందన్న వాదనను ఈ సర్వే మళ్ళి అదే తేల్చి చెప్పింది . ఐఏఎన్ఎస్ - సి ఓటర్ సర్వేను 2021లో ఎన్నికలు జరిగిన అస్సాం కేరళ తమిళ నాడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాల పనితీరుపై సర్వే జరపగా తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎక్కువ మెజారిటి రావడం జరగగా .. పనిలో పనిగానే దేశ ప్రధాన మంత్రిగా ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నపై సర్వే నిర్వహించగా రాహుల్ గాంధీ అని 54 శాతం మంది ఒప్పుకోవడం గమనార్హం. అయితే దక్షిన భారతదేశంలో అత్యదికంగా రాహుల్ గాంధీని తమ ప్రధానిగా ప్రజలు అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని తీరు బాగుందని కేవలం 17 శాతం మంది మాత్రమే ఒప్పుకోవడం జరిగింది . 40 శాతం పైగా ప్రజలు పర్వాలేదు అన్నట్లుగా వెల్లడించారు.





Untitled Document
Advertisements