పెట్రో ధరల విషయంలో కేంద్రం తీరు పై కెసిఆర్ మండిపాటు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 01:47 PM

పెట్రో ధరల విషయంలో  కేంద్రం తీరు పై కెసిఆర్ మండిపాటు

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. అయితే ఇటివల కాలంలో దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు రాష్ట్రాలు , రాష్ట్రాలు తగ్గించాలని కేంద్రం పదేపదే వాదనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే .. అయితే కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించగా వాహనదారులు కొంతవరకు రిలీఫ్ అయ్యారు. అయితే మల్లి రాష్ట్రాలు ట్యాక్స్ లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులూ అధికారంలో ఉన్న పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మేర పన్ను శాతాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ఆ సూచన మేరకు అప్పట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించగా . ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. అయితే తెలంగాణా ప్రభుత్వానికి పెట్రో ధరల విషయంలో వ్యతిరేఖంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ నాయకుల తీరుపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. దేశం లో 2014 కు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని .. ఇలా పెరగడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. పూర్వం ఒక వ్యాపారి 300 ధర పెంచి 30 రూపాయలు తగ్గించాడట .. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లను అమాంతం సగానికి పెంచి 10 రూపాయలు తగ్గించి రాష్ట్రాలపై అలా ఎలా ఒత్తిడి చేస్తారని ధ్వజమెత్తారు. అంతేకాక అప్పటికి ఇప్పటికి చమురు ధరలు అలాగే ఉంటె పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం ఎందుకు పెంచిందో చెప్పాలన్నారు .





Untitled Document
Advertisements