ఎస్‌బీఐ ఖాతాదారులను హెచ్చరిస్తున్న ప్రభుత్వం.. ఈ మెసేజ్ ఈమెయిల్స్ తో జాగ్రత్త

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 03:55 PM

ఎస్‌బీఐ ఖాతాదారులను హెచ్చరిస్తున్న ప్రభుత్వం.. ఈ మెసేజ్ ఈమెయిల్స్ తో జాగ్రత్త

మీకు గనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)తమ కస్టమర్లను హెచ్చరిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తాజాగా ఎస్‌బీఐ కస్టమర్లు ఫేక్ ఎస్ఎంఎంస్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది అని మెసేజ్‌లు రావొచ్చని హెచ్చరించింది. ఈ మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని, వీటికి స్పందించొద్దని కోరింది. అలాగే ఇ --మెయిల్స్ వచ్చిన కూడా పట్టించుకోవద్దని ఇలాంటి మెసేజ్‌ లేదా మెయిల్స్ వల్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను మోసగాళ్లు తస్కరించే అవకాశం ఉందని తెలిపింది. ఇటువంటి మెసేజ్ లు గనుక మీ ఫోన్ కు వచ్చినట్టు అయితే వాటిని వెంటినే డిలేట్ చేయడం ఉత్తమం అని పేర్కొంది.
మీ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందంటూ వచ్చే మెసేజ్‌ ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ తెలిపింది. పర్సనల్, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయాలంటూ వచ్చే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లతో జాగ్రత్త ఉండాలని, వాటికి స్పందించొద్దని పేర్కొంది. మీకు ఇలాంటి మెసేజ్‌లు ఏమైనా వస్తే వెంటనే ఆ విషయాన్ని report.phishing@sbi.co.inకు తెలియజేయాలని కోరింది.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఫేక్ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ అంశంపై కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా మనీ విత్‌డ్రా చేస్తే కనుక వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్‌కు తెలియజేయాలని కోరింది. గుర్తుతెలియని నెంబర్ల నుంచి మెసేజ్‌ లేదా తెలియని ఈమెయిల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని, వాటిల్లో మోసపూరిత లింక్స్ ఉండొచ్చని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది.





Untitled Document
Advertisements