తనతో పాటు 50కి పైగా తెలుగుదేశం నేతలపై కేసులట.. లోకేష్

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 04:28 PM

తనతో పాటు 50కి పైగా తెలుగుదేశం నేతలపై కేసులట.. లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గతంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని అని ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నారా లోకేష్ విచారణలో భాగంగా విజయవాడ కోర్టుకు వెళ్లారు. అయితే నారా లోకేష్ తో పాటుగా విజయవాడ కోర్టుకు కొల్లు రవీంద్ర తెలుగుదేశం నాయకులు వెళ్లడం జరిగింది . అనంతరం కోర్ట్ నుండి బయటకు వచ్చిన నారా లోకేష్ అధికార వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ధ్వజం ఎత్తారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై 21 కేసులను పెట్టారని .. అయితే ఈ కేసుల ద్వారా ప్రభుత్వం ఏం సాధించింది అని మండిపడ్డారు. అంతేకాక అక్రమ కేసులతో తన గొంతును ఆపలేరని జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. అంతేకాక నారా లోకేష్ తో పాటు మరో 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పై ప్రభుత్వం కేసులు పెట్టిందని మండిపడ్డారు. కాగా నారా లోకేష్ తో పాటు విజయవాడ కొడుకు అనేక మంది కార్యకర్తలు రాగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని కేవలం కొంతమంది ముఖ్య నాయకులని మాత్రమే కోర్టు లోపలకి అనుమతించారు.





Untitled Document
Advertisements