ఎఫ్ 3 విజయం సాధిస్తే ఎఫ్ 4 కు ఆలస్యం లేకుండా క్లాప్ కొడతా.. దిల్ రాజు

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 11:44 AM

ఎఫ్ 3 విజయం సాధిస్తే ఎఫ్ 4 కు ఆలస్యం లేకుండా క్లాప్ కొడతా.. దిల్ రాజు

గతంలో వెంకిమామ, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 చిత్రం ఎంతగా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలై దాదాపు 3 ఏళ్ళ పైనే గడిచినా ఆ సినిమాలోని అంతేగా అంతేగా అనే డైలాగ్ నేటికి ప్రేక్షకులు మరిచిపోలేదు. సినిమాని పక్క కామెడి జోనర్ లో అద్బుతంగా మలిచారు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 చిత్రం విడుదల తరువాత దాదాపు మూడు సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న ఎఫ్ 3 సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే ఎఫ్3 ని మొదలు పెట్టబోతున్నట్లుగా ఆ సమయంలోనే దిల్ రాజు మరియు అనీల్ రావిపూడి ప్రకటించారు. ఇప్పుడు ఎఫ్ 3 విడుదల కాకుండానే ఎఫ్ 4 గురించిన చర్చ స్వయంగా యూనిట్ సభ్యులు జరిపారు.
ఇద్దరు హీరోలతో పాటు డైరెక్టర్, ప్రొడ్యుసర్ అంతా కూడా ఎఫ్ 4 తప్పకుండా ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. వరుణ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి ఎఫ్ 4 కోసం రెండు మూడు స్టోరీ లైన్స్ కూడా దర్శకుడు సిద్దం చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 విజయం సాధిస్తే ఎఫ్ 4 కు ఆలస్యం లేకుండా క్లాప్ కొడతామని నిర్మాత దిల్ రాజు కూడా మరో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అయితే ఎఫ్ 3 చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా ఎఫ్ 4 ఉంటుందని అనీల్ రావిపూడి దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో ఎఫ్ 4 లో మరో హీరో ఉంటాడని కూడా ఆయన హింట్ ఇచ్చాడు. ఎఫ్ 3 లోనే మరో హీరో ఉంటాడని వార్తలు వచ్చాయి. రవితేజ కు ఎఫ్ 3 స్టోరీ లైన్ వినిపించారు.. ఆయన ఓకే అన్నాడు అంటూ ప్రచారం జరిగింది. దిల్ రాజు నో చెప్పడంతో అనీల్ రావిపూడి వెనక్కు తగ్గాడు అనేది పుకార్ల సారాంశం.
ఎఫ్ 3 విషయంలో మూడవ హీరో వార్తలు పుకార్లుగానే మిగిలి పోయినా ఎఫ్ 4 విషయంలో మాత్రం ఖచ్చితంగా మూడవ హీరో విషయం నిజం అవుతుందని అనీల్ రావిపూడి మాటల ద్వారా అనిపిస్తుంది. రవితేజ ఎఫ్ 3 లో మిస్ అయినా ఎఫ్ 4 లో నటిస్తే సూపర్ అంటూ ఇప్పటి నుండే ఫ్యాన్స్ పొంగి పోతున్నారు. మొత్తానికి ఎఫ్ 4 కు సంబంధించిన హడావుడి ఇప్పటి నుండే మొదలు అవ్వడం కాస్త విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఎఫ్ 3 లో వెంకటేష్.. వరుణ్ తేజ్ తో పాటు సునీల్ మరియు వెన్నెల కిషోర్లు కూడా ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. సునీల్ పాత్రను కాస్త పెంచి రవితేజతో మొదట చేయించాలని అనీల్ భావించాడేమో. దిల్ రాజు బడ్జెట్ పేరు చెప్పి అనీల్ ను వారించాడేమో అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఎఫ్ 4 చిత్రం విషయంలో ఎన్ని ప్రచారాలు జరిగినా ఎఫ్ 3 కి బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ వస్తేనే సెట్స్ పైకి వెళ్లేది అనేది కొందరి అభిప్రాయం.
అనీల్ రావిపూడి ఎఫ్ 3 తర్వాత చేయబోతున్న చిత్రం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఆలస్యం చేయకుండా వెంటనే అఖండ హీరో బాలకృష్ణతో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న సినిమా ముగింపు దశకు వచ్చింది. కనుక అనీల్ రావిపూడి సినిమా రెండు మూడు నెలల్లోనే పట్టాలెక్కి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. బాలయ్య సినిమా తర్వాత ఎఫ్ 4 గురించి చర్చ జరగాల్సి ఉంది.









Untitled Document
Advertisements