యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ లను నియమించే అధికారాలు ఇకపై గవర్నర్ కు లేవు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 02:20 PM

యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ లను నియమించే అధికారాలు ఇకపై గవర్నర్ కు లేవు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ కు మధ్య ఉన్న వివాదాలు గురించి అందరికీ తెలిసిందే. అంతేకాక ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ లను నియమించే అధికారం గవర్నర్కు తొలగిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రకటించిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అయితే పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం గవర్నర్ ఛాన్స్లర్గా జగదీప్ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఆయన కొన్ని యూనివర్సిటీ లకు వైస్ ఛాన్స్లర్ లను తన సొంత ప్రాతిపదికన నియమించారు. అయితే ఈ అంశంపై మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతుంది. త్వరలో గవర్నర్కు యూనివర్సిటీలకు వైస్ఛాన్సలర్ లను నియమించే అధికారాన్ని తొలగిస్తామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే బిల్లుకు ఆమోదం కలిపినట్లయితే ఆ బాధ్యతలను సీఎంకు బదిలీ చేయనున్నట్లుగా ప్రభుత్వ నాయకులు వెల్లడించారు.

Untitled Document
Advertisements