భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు చిట్టాను విప్పిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 02:39 PM

భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు చిట్టాను విప్పిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిన్న హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుంది అంటూ ప్రతిసారీ కుటుంబ పార్టీ అంటూ తెరాస పార్టీ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏ.. బిజెపిలో కుటుంబ పాలనలో భాగంగా ఎంత మంది నాయకులు లేరు అంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలన చిట్టాను విప్పి చెప్పారు. భారతీయ జనతా పార్టీ లో దాదాపు ముప్పై కుటుంబాలకు సంబంధించిన వారు రాజకీయాల్లో ఉన్నారని వారంతా వారసత్వ రాజకీయాలను కొనసాగించడం లేదా అని ప్రశ్నించారు. అయితే జీవన్ రెడ్డి వారసత్వ రాజకీయాలకు బిజెపి అడ్డ అంటూ వచ్చిన వార్తా కథనాలను ఆధారంగా భారతీయ జనతాపార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలు చేసుకుంటూ మీరా మమ్మల్ని ప్రశ్నించేది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పై మండిపడ్డారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారని అంతేకాక అనురాగ్ ఠాకూర్ కుటుంబం పియుష్ గోయల్ కుటుంబం ఇలా 30 కుటుంబాలకు సంబంధించిన వారు వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.





Untitled Document
Advertisements