కొత్తిమీర రసంతో అందం ఆరోగ్యం రెండు మీసొంతం!

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 06:09 PM

కొత్తిమీర రసంతో అందం ఆరోగ్యం రెండు మీసొంతం!

కొత్తిమీర ఇది వంటలు చేసిన తరువాత వంటలకు మరింత రుచి మరియు సువాసన చేకూర్చడం కోసం వంట చేసిన తరువాత చివర్లో చేరుస్తారు. కొన్ని రకాల వంటలలో అలంకరణ కొరకు కూడా వాడడం పరిపాటే. కూరలతో కొత్తిమీర వాడటం వలన రుచి వస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కొత్తిమీరను కూరల్లో దించే ముందు వాడుట వలన దానిలోని పోషక విలువలు చక్కగా మన శరీరానికి అందుతాయి. కొత్తిమీర గింజలుగా చెప్పుకోబడే ధనియాలను కూడా వివిధ రకాలుగా వాడడం అలవాటే. అదేవిధంగా ఈ కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
* అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గాలంటే కొత్తిమీర పచ్చడి తినాలి.
* విటమిన్ సి,ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ కార్బోహైడ్రేట్స్ విరివిగా లభిస్తాయి.
* ఈ కొత్తిమీర ఆకులు నేరుగా తింటే ఆకలి పెరుగుతుంది.
* కొత్తిమీర ఎండబెట్టి కూడా కూరలో వాడుకోవచ్చు.
* రాత్రి పడుకునే ముందు ఒక కట్ట రసం తాగితే నిద్ర బాగా పడుతుంది.
* కొత్తిమీర మెత్తగా దంచి చర్మానికి రాసుకుంటే, ముడతలు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది.
* దనియాలను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని మరునాడు మరిగించి తాగడం వలన అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* అధిక బరువుని తగ్గించడంలోనూ ధనియాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ధనియాల కషాయంతో ఒంట్లో పేరుకు పోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
* గర్భిని స్త్రీలలో కాళ్ళు వాపులు రావడం మనం గమనిస్తూనే ఉంటాం. అటువంటి సమయంలో ధనియాలు, పచ్చి సోంపు రెండు సమభాగాలుగా తీసుకుని మరిగించి . మరిగిన కషాయం చల్లారిన తరువాత కొద్దిగా తేనే కలిపి తీసుకుంటే ఈ వాపులు తగ్గి మూత్ర విసర్జన సజావుగా సాగుతుంది.

Untitled Document
Advertisements