మళ్లీ కుటుంబ రాజకీయాల మాట కిషన్ రెడ్డి నోట

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 12:18 PM

మళ్లీ కుటుంబ రాజకీయాల మాట కిషన్ రెడ్డి నోట

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిజాం వారసులు అయినా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నరని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఏ విధంగా ఫలితాలు వస్తాయి అలాంటి ఫలితాలు వస్తాయని కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా ఎన్నికలలో గెలవలేరని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని కుటుంబ పార్టీలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తూ వస్తుందని భారతీయ జనతా పార్టీ తీరును గురించి చెప్పుకొచ్చారు. గతంలో కూడా కెసిఆర్ అది చేస్తాం ఇది చేస్తాం అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు కానీ ఏమి చేయలేక పోయారని అన్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం దేశం కోసం రోజుకు 18 గంటలు పని చేస్తారని వెల్లడించారు . ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రికి రాష్ట్రం పై ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా పని చేస్తున్నారని రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక కేంద్రం గ్రామాలకు విడుదల చేసిన నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అయితే కిషన్రెడ్డి కుటుంబ పార్టీల గురించి కుటుంబ రాజకీయాల గురించి ఈ సమావేశంలో మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కుటుంబ రాజకీయాలు ఎలా ఉన్నాయో వివరించడం జరిగింది ఇలాంటి సందర్భంలో కూడా కిషన్రెడ్డి మళ్లీ కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పడం హాస్యాస్పదమే.

Untitled Document
Advertisements