తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే ఫై చేయి..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 12:03 PM

తెలంగాణ ఇంట‌ర్  ఫ‌లితాల్లో  బాలిక‌ల‌దే ఫై చేయి..

తెలంగాణ ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. అయితే ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే ఫై చేయి . ఫ‌స్టియ‌ర్‌లో 2,33,210 మంది ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా, 1,68,692 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. జ‌న‌ర‌ల్, వొకేష‌న‌ల్ కోర్సుల్లో క‌లిపి 72.33 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలురు కేవ‌లం 54.55 శాతం మాత్ర‌మే ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో 2,19,271 మంది ప‌రీక్ష‌ల‌కు హాజరు కాగా, 1,65,060 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. జ‌న‌ర‌ల్ వోకేష‌న‌ల్ కోర్సుల్లో క‌లిపి 75.28 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మీడియా ముందు వెల్ల‌డించారు. బాలురు కేవ‌లం 59.21 శాతం ఉత్తీర్ణ‌త సాధించార‌ని తెలిపారు .

Untitled Document
Advertisements