ఆ సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గనున్న ఎన్టీఆర్

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 12:07 PM

ఆ సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గనున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ౩౦ వ సినిమా-హట్రిక్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తుందని ఇప్పటికే ప్రకటించగా ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ 'ఆచార్య' ఫ్లాప్ అవడంతో .. ఇది పాన్ ఇండియా సినిమా కావడం వలన ఈ స్క్రిప్ట్ పై కొరటాల గట్టిగానే మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఈ సినిమా హిట్ తో 'ఆచార్య' ఫ్లాప్ ను కవర్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని సినీవర్గాలు అంటున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో కొమరం భీమ్ పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడట. దాదాపు ఓ పది కేజీలు తగ్గవలసి ఉంటుందని కొరటాల చెప్పడంతో, ఎన్టీఆర్ ఆ పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు లేట్ అయిందని చెబుతున్నారు.ఆలస్యం ఎలాగో అయింది కనుక, 'వినాయక చవితి' రోజున ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. 'జనతా గ్యారేజ్' తరువాత వస్తున్న సినిమా కావడం వలన, అందరు బారి అంచనాలుతో ఉన్నారు . ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. కొరటాల శివ "ఆచార్య" ఫ్లాప్ ని కవర్ చేసే విధంగా పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకుంటడేమో చూడాలి .

Untitled Document
Advertisements