రణవీర్ సింగ్ ' దిగంబర ' రూపాన్ని సమర్థించిన జాన్వీ

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 12:36 PM

రణవీర్ సింగ్ ' దిగంబర ' రూపాన్ని సమర్థించిన జాన్వీ

తాజాగా దిగంబర ఫోటో షూట్ తో బాలీవుడ్ నటుడు రణవీర్ విమర్శల పాలు అవుతూ వార్తల్లో నిలిచారు. చాల మంది ఆయనను విమర్శిస్తుండగా.. ఆయనకు మద్దతుగా నిలిచేవారు సైతం పెరుగుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్ధమాన కథనాయకి, నట దిగ్గజం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం రణవీర్ కు మద్దతుగా నిలిచింది. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో జాన్వీ కపూర్ పాల్గొన్నది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఆమెకు రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ మేగజైన్ కవర్ పేజీ కోసం రణవీర్ వంటిపై ఏమీ లేకుండా ఫొటోలు దిగడం తెలిసిందే. దీన్ని కళాత్మక స్వేచ్ఛగా జాన్వీ కపూర్ అభివర్ణించింది. ఏ ఒక్కరి కళాత్మక స్వేచ్ఛను శిక్షించరాదని ఆమె పేర్కొన్నారు. జాన్వీ అనే కాకుండా.. రణవీర్ చేసిన పనిని మరెంతో మంది బాలీవుడ్ ప్రముఖులు సమర్థిస్తున్న విషయం తెలిసిందే. రణవీర్ తో కలసి నటించిన పరిణీతి చోప్రా, వాణి కపూర్, అలియా భట్, విద్యా బాలన్ సహా ఎంతో మంది రణవీర్ చేసిన ఈ పనిని వెనుకేసుకొచ్చారు. విద్యా బాలన్ అయితే.. ‘‘అసలు సమస్య ఏంటి? ఓ వ్యక్తి మొదటిసారి చేశారు కదా. దీన్ని కూడా ఆస్వాదించండి’’అని విద్యా బాలన్ పేర్కొనడం గమనార్హం. ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి.

Untitled Document
Advertisements