ఫ్లిప్‌ కార్ట్‌ బిగి సేవింగ్స్‌ భారీ తగ్గింపు ధరలో

     Written by : smtv Desk | Tue, Aug 02, 2022, 04:58 PM

ఫ్లిప్‌ కార్ట్‌ బిగి సేవింగ్స్‌ భారీ తగ్గింపు ధరలో

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ నెల 6 నుంచి 10 వరకు ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తోంది. వీటిలో వివిధ వస్తువులపై భారీ తగ్గింపులను ఆ కంపెనీ ప్రకటించింది. దేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అయిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన విక్రయ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ఏటా ఆగస్ట్ 15, దసరా, దీపావళికి ముందు ఈ రెండు సంస్థలు పోటా పోటీగా, భారీ ఆఫర్లతో డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ నెల 6 నుంచి 10 వరకు ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తోంది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఇస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, గృహోపకరణాలపై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 50-80 శాతం మధ్య తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు 5వ తేదీ నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఇందులో భాగంగా ఒప్పో, వివో, యాపిల్, రియల్ మీ, పోకో, శామ్ సంగ్, మోటోరోలా ఫోన్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేయనుంది. వీటిని త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో డీల్స్ వివరాలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించనుంది. ఆసక్తి కలిగిన వారు ఫ్లిప్ కార్ట్ సైట్ ను పరిశీలిస్తూ ఉంటే వివరాలు తెలుస్తాయి.
అమెజాన్ అయితే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఎస్ బీఐ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందొచ్చు. దీనికి అదనంగా ఆయా ఉత్పత్తులపై విడిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది. వచ్చే రెండు మూడు రోజుల్లో డీల్స్ వివరాలు వెల్లడి కానున్నాయి.

Untitled Document
Advertisements