మిరప పంట లో నారు కుళ్ళుతెగులు యాజమాన్యం.

     Written by : smtv Desk | Tue, Aug 02, 2022, 05:32 PM

మిరప పంట లో నారు కుళ్ళుతెగులు యాజమాన్యం.

మిరప వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంట. భారతదేశంలో 8,30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దిగుబడి18,72,000 టన్నలు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిరప 1,20,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు 3.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని పొందుతున్o.
లక్షణాలు: ఈ తెగులు లక్షణాలు 2 దశల్లో కనిపించును.
మొలకలు నేల పైకి రాక ముందు - ఈ దశలో మొలకెత్తిన విత్తనాలు నేల పైకి రాక ముందే కుళ్ళి చనిపోతాయి.
కొన్ని సార్లు విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళి పోవును.
విత్తనం నుండి ప్రధమ మూలం మరియు ప్రధమ కాండం పూర్తిగా రాక ముందే కుల్లిపోవును.
ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నేలలోనే జరుగును. కనుక దీనిని గుర్తించలేక విత్తనం మొలకెత్తలేదని భావిస్తారు.
మొలకలు నేలపైకి వచ్చిన తరువాత విత్తనం మొలకెత్తిన తరువాత మరియు మొక్కల కాండం గట్టి పడే వరకు ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు.
సాధారణంగా తెగులు మొక్క యొక్క వేర్ల ద్వారా లేదా నేలను తాకే కాండం ద్వారా సోకుతుంది.
తెగులు సోకిన భాగాలు మెత్తగా ఉండి నీటిని పీల్చుకున్నట్లు కనిపిస్తాయి.
తెగులు తీవ్రత వలన నేలను తగిలే కాండం వద్ద కుళ్ళిపోయి నేలపై విరిగితాయి.
ఆరోగ్యంగా ఉన్న నారు మొక్కలు ఒక రోజులోనే ఈ తెగులుకు గురి అగును.
సాధారణంగా నారు మొక్కలు చనిపోయే ముందు బీజదళాలు ఆకులు వాడిపోవడం. ఈ తెగులు ఆశించడం వలన నారు మడిలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
అనుకూల పరిస్థితులు:లేత మొక్కలలోనే ఈ శిలీంద్రం తెగులును కలుగజేస్తుంది. కణజాలాలు గట్టిపడిన తర్వాత తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
నేలలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉండడం. బాగా చివకని పశువుల ఎరువు వాడటం. గత పైరుకు సంభందించిన మోళ్ళు, ఎండిన ఆకులుండడం. మురుగు నీరు పోయే సౌకర్యం సరిగా లేకుండుట.
పంట మార్పిడి చేయకపోవటం. నారు మడిలో విత్తన మోతాదు ఎక్కువ వేయడం.
వ్యాప్తి: ఈ శిలీంధ్రబీజాలు భూమి ద్వారాను, నీటి ద్వారాను ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందును.
నివారణ : తేలిక పాటి నెలల్లో నారు మడి వేయాలి.
భూమట్టం కంటే 6-8 అంగుళాలు ఎత్తైన నారు మడిలో విత్తనం పోయాలి.
నారు మడిలో విత్తనాలు పల్చగా చల్లాలి.
పూర్తిగా చివికిన పశువుల ఎరువు వాడాలి.
తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీరు పెట్టాలి.
ఒకే మడిలో ప్రతి సంవత్సరం నారు పెంచరాదు.
అధిక మోతాదులో నత్రజని వాడరాదు.
నారుమడి వేసే స్థలంలో నేలపై చెత్త వేసి కాల్చాలి.
థైరామ్ / కాప్టస్ 3 గ్రా. 1 కేజి విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
నారు మడిని తీసిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో మాంకోజెబ్ 0.25% లేదా కార్బండిజం 0.1% మందును నేల తడిచేలా పిచికారి చేయాలి

Untitled Document
Advertisements