టీ20 వరల్డ్ కప్ కి భారత జట్టును ప్రకటించిన బీసిసిఐ

     Written by : smtv Desk | Mon, Sep 12, 2022, 05:59 PM

టీ20 వరల్డ్ కప్ కి భారత జట్టును ప్రకటించిన బీసిసిఐ

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును బీసిసిఐ సెలెక్టర్ల బృందం నేడు ప్రకటించింది. జట్టు ఎంపిక సంచలన నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. దాదాపుగా పాత ఆటగాళ్లనే ఎంపిక చేశారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ లకు బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లకు జట్టులో చోటు కల్పించారు. గత టీ20 మ్యాచ్ లలో అంత గొప్ప ప్రదర్శనలు ఏవి ఇవ్వకపోయినా కాని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై నమ్మకం ఉంచినట్టు అర్థమవుతోంది. యువ ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా తమ స్థానాలను నిలుపుకున్నారు. ఇక శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ లను స్టాండ్ బై ఆటగాళ్లుగా తీసుకున్నారు.
భారత జట్టు ఇదే...రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్. స్టాండ్ బై ఆటగాళ్లు...మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్.

Untitled Document
Advertisements