సరిగ్గా రెండేళ్ల తరువాత మరోసారి భారీ సంఖ్యలో ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 03:55 PM

సరిగ్గా రెండేళ్ల తరువాత మరోసారి భారీ సంఖ్యలో ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్

తిమింగలము ఆంగ్లం లో వేల్ అంటారు. ఇవి వెచ్చటి రక్తాన్ని కలిగిన నీటిలో నివసించే ఒక పెద్ద క్షీరదము. చాలాకాలం పూర్వమే సముద్ర ప్రయాణం చేస్తున్న నావికులు భారీ శరీరం, బలమైన తోక కలిగిన ఈ సముద్ర జీవిని గుర్తించడం జరిగింది. వీటిని అమెరికా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఒకటిగా చేర్చింది.
రెండేళ్ల క్రితం 2020 సెప్టెంబర్ 21న ఆస్ట్రేలియా తీరానికి 470 లాంగ్ ఫిన్డ్ పైలట్ వేల్స్ తీరానికి కొట్టుకొచ్చాయి. ఇంత పెద్ద సంఖ్యలో వేల్స్ తీరానికి కొట్టుకురావడం ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే ప్రథమం. వాటిలో వందకిపైగా వేల్స్ మాత్రమే బతికాయి.
మారోసారి ఆస్ట్రేలియాలో భారీ సంఖ్యలో పైలట్ వేల్స్ కొట్టుకొచ్చాయి. టాస్మానియా పశ్చిమ తీరంలోని మక్వారీ హార్బర్‌కు బుధవారం 230కిపైగా వేల్స్ కొట్టుకొని రగా అందులో దాదాపు 200 వేల్స్ ప్రాణాలు కోల్పోయాయి. 30కిపైగా వేల్స్‌ను మాత్రం రెస్క్యూ సిబ్బంది గురువారం తిరిగి సముద్రంలోకి పంపగలిగారు. రెండేళ్ల క్రితం ఇదే హార్బర్‌కు భారీ సంఖ్యలో వేల్స్ కొట్టుకొని రావడం గమనార్హం. తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్‌ను తిరిగి సముద్రంలోకి పంపేంత వరకు.. వేడి కారణంగా అవి చనిపోకుండా వాలంటీర్లు వాటిపై టవళ్లు, షీట్లు ఉంచి.. బకెట్లతో నీళ్లు పోస్తూ.. తడి ఆరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తీరానికి కొట్టుకొచ్చిన 230 వేల్స్‌లో 35 వేల్స్‌ను మాత్రం రక్షించగలిగామని గురువారం ఉదయం అధికారులు తెలిపారు. కానీ గురువారం మధ్యాహ్నం నాటికి 32 వేల్స్ మాత్రమే బతికాయని బ్రెండన్ క్లార్క్ అనే అధికారి తెలిపారు. ఇక్కడి బీచ్‌లో పరిస్థితులు మిగతా ప్రదేశాల కన్నా ఎంతో కష్టతరంగా ఉంటాయని క్లార్క్ తెలిపారు. గతంలో వైల్డ్ లైఫ్ ట్రైనింగ్ పొందిన లేదా అనుభవం ఉన్నవారిని మాత్రమే రెస్క్యూ ఆపరేషన్‌లో వాలంటీర్లుగా పని చేయడానికి అధికారులు అనుమతిస్తున్నారు.
వేల్స్‌ను ఆస్ట్రేలియా రక్షిత ప్రాణుల జాబితాలో చేర్చింది. దీంతో వేల్స్ కళేబరాలు కనిపించినా.. వాటి జోలికి వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ వారం ఆరంభంలో ఆస్ట్రేలియాలోని కింగ్ ఐలాండ్ తీరానికి 14 స్పెర్మ్ వేల్స్ కొట్టుకొచ్చాయి. దురదృష్టవశాత్తూ అవన్నీ ప్రాణాలు కోల్పోయాయి. వేల్స్ ఇలా పెద్ద సంఖ్యలో తీరానికి కొట్టుకొచ్చి చనిపోవడానికి కారణాలు అంతుబట్టడం లేదనని మెరైన్ నిపుణులు చెబుతున్నారు. వేల్స్ ఇలా కొట్టుకురావడం అనేది మిస్టరీగానే ఉందంటున్నారు. ఒకే వారంలో రెండుసార్లు సముద్ర జీవులు ఇలా తీరానికి కొట్టుకొని రావడం మాత్రం అసాధారణం అంటున్నారు.





Untitled Document
Advertisements