నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎవర్ గ్రీన్ చిత్రం మేఘసందేశం..

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 01:36 PM

నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎవర్ గ్రీన్ చిత్రం మేఘసందేశం..

నేటితో నటసామ్రాట్ ఏఎన్నార్ గారి కెరీర్ మెమరబుల్ మూవీగా నిలిచిపోయిన 'మేఘసందేశం' 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. నటసామ్రాట్ ఏఎన్నార్ – దర్శకరత్న దాసరి నారాయణ రావుల కలయికలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అక్కినేనికి నటుడిగా 200వ సినిమా ఇది.
భార్య దాసరి పద్మ సమర్పణలో తారక ప్రభు ఫిలింస్ బ్యానర్ మీద దాసరి నిర్మించారు. భార్య దాసరి పద్మ సమర్పణలో తారక ప్రభు ఫిలింస్ బ్యానర్ మీద దాసరి నిర్మించారు. జయసుధ, జయప్రద, జయసుధ సోదరి సుభాషిణి, జగ్గయ్య, సలీమా కీలకపాత్రల్లో నటించగా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అతిథి పాత్రలో కనిపించారు. రమేష్ నాయుడు సంగీతం, పి.ఎస్.సెల్వరాజ్ కెమెరా, బి.కృష్ణం రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1982 సెప్టెంబర్ 24న తెలుగునాట భారీస్థాయిలో విడుదల చేశారు. 2022 సెప్టెంబర్ 24 నాటికి ‘మేఘసందేశం’ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
విశేషం ఏంటంటే ఏఎన్నార్, వాణిశ్రీ జంటగా కె.ఎస్. ప్రకాశ రావు (కె.రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మూవీ మెఘల్ డి.రామానాయుడు నిర్మించిన సెన్సేషనల్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమనగర్’ 1971 సెప్టెంబర్ 24న విడుదలైంది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున (1982 సెప్టెంబర్ 24) ‘మేఘసందేశం’తో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టారు అక్కినేని.
గొప్ప కవి, కళల్నీ, ప్రకృతిని ప్రేమించే సున్నిత మనస్కుడు రవీంద్ర బాబు (అక్కినేని) పల్లెటూరి అమ్మాయి పార్వతి (జయసుధ) ను వివాహం చేసుకుంటాడు రవీంద్ర బాబు కానీ వీరి కాపురం అనుకున్నంత సజావుగా సాగదు ఇంతలో పద్మ (జయప్రద) అనే నాట్యకారిణిని చూసి తొలిచూపులోనే ఆకర్షితుడవుతాడు క్రమంగా ఆమె చూపులు, స్పర్శ, నాట్యానికి ఆరాధ్యుడవుతాడు దీని మూలంగా రవీంద్ర బాబు కుటంబంలో కలహాలు రావడం భార్య అతణ్ణి, పద్మని అపార్థం చేసుకోవడం చివరిగా భార్యను కలుసుకుని ప్రాణాలొదలడం ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది ‘మేఘసందేశం’





Untitled Document
Advertisements