రాగి చాక్లెట్ కాంబినేషన్ లో టేస్టీ కేక్ ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 05:59 PM

రాగి చాక్లెట్ కాంబినేషన్ లో టేస్టీ కేక్ ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..

ఇంట్లో కేక్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. నిజానికి బేకరీలో దొరికే మైదా కేక్ ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇంటిలోనే హెల్తీ పదార్థాలతో చేసుకునే రాగి చాక్లెట్ కేక్ ను ట్రై చేయండి. ఈ కేక్ ను చేసుకుని మీ కుటుంబ సభ్యుల నోరు తీపిని చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ కేక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ముప్పావు కప్పు రాగి పిండి, ముప్పావు కప్పు గోధుమపిండి, సగం కప్పు చక్కెర పొడి, ఒకటిన్నర స్పూన్ ల బేకింగ్ పౌడర్, సగం స్పూన్ బేకింగ్ సోడా, ఒకటిన్నర కప్పు పాలు, పావు కప్పు కోకో పొడి, పావు స్పూన్ వెనీలా ఎసెన్స్, సగం కప్పు కరిగించిన వెన్న , చిటికెడు ఉప్పు, 150 గ్రాముల డార్క్ చాక్ల, 250 ml ఫ్రెష్ క్రీమ్, కొన్ని బాదం పలుకులు, కొద్దిగా రాళ్ల ఉప్పు .
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని ఇందులో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కోకో పౌడర్, చక్కెర పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు, వెనిలా ఎసెన్స్, కరిగించిన వెన్న వేసి ఒకే డైరెక్షన్ లో బాగా కలుపుతూ ఉండాలి. అయితే పిండి కలిపినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. పిండిని ఓకే డైరెక్షన్ లో కలవడం ముఖ్యం. ఇప్పుడు ఒక అల్యూమినియం పాత్రను తీసుకుని ఈ పాత్రకు అన్నివైపులా వెన్న రాసి కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో రాళ్ల ఉప్పును మందంగా వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండాఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇందులో కేక్ మిశ్రమం ఉన్నా పాత్రను నుంచి మూతపెట్టి తక్కువ మంట మీద దాదాపు 45 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి టూత్ పిక్ ను కేకులో గుచ్చితే కేక్ మిశ్రమం ఏమాత్రం అంటకుంటే కేక్ రెడీ అని అనుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కేకును చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో చాక్లెట్ ముక్కలు, ఫేస్ క్రీమ్ వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.





Untitled Document
Advertisements