ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీస్ డివిజన్ విభాగాల్లో నోటిఫికేషన్‌

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:11 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  రిఫైనరీస్ డివిజన్ విభాగాల్లో నోటిఫికేషన్‌

అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీస్ డివిజన్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1535 పోస్టులను భర్తీ చేయనున్నారు. గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్‌ తదితర రిఫైనరీల్లో ఈ ఖాళీలున్నాయి.
మొత్తం ఖాళీలు 1535 ఉండగా అప్రెంటిస్- అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)- 396, ట్రేడ్ అప్రెంటిస్(ఫిట్టర్)- 161, ట్రేడ్ అప్రెంటిస్(బాయిలర్)- 54, అప్రెంటిస్(కెమికల్/ రిఫైనరీ & పెట్రో-కెమికల్)- 332, టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్)- 163
టెక్నీషియన్ అప్రెంటిస్(ఎలక్ట్రికల్)- 198, టెక్నీషియన్ అప్రెంటిస్(ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్)- 74, ట్రేడ్ అప్రెంటిస్(సెక్రటేరియల్ అసిస్టెంట్)- 39, ట్రేడ్ అప్రెంటిస్(అకౌంటెంట్)- 45, ట్రేడ్ అప్రెంటిస్(డేటా ఎంట్రీ ఆపరేటర్)- 73 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత ఉండాలి. వయసు 30-09-2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతరీక్ష, విద్యార్హత ప్రమాణాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్‌ 23 వరకు కొనసాగుతుంది. 06.11.2022 నాడు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. 11.2022 నుంచి 05.11.2022 వరకు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోగలరు. పరీక్ష ఫలితాలు 21.11.2022న వెల్లడిస్తారు.అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.iocl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.





Untitled Document
Advertisements